నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. మంగళవారం రాత్రి అనూహ్యంగా కవిత పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. బుధవారం ఉదయం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్ సమర్పించారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్