14 రోజుల త‌ర్వాత‌.. డైమండ్ ప్రిన్‌సెస్ ఖాళీ !

డైమండ్ ప్రిన్‌సెస్‌కు 14 రోజుల క్వారెంటైన్ ముగిసింది.  ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన జ‌పాన్‌లోని యోక‌హోమా న‌గ‌ర తీరం వ‌ద్ద నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ నౌక నుంచి ప్ర‌యాణికులు ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు.  అంటు వ్యాధి సోకిన‌ప్పుడు.. వారిని రెండు వారాల పాటు దూరం పెట్ట‌డం ప్రాచీన సాంప్ర‌దాయం. దాన్నే క్వారెంటైన్ అంటారు.  అయితే షిప్‌లో క‌రోనా వైర‌స్ సోకిన ప్ర‌యాణికులు ఉన్నార‌న్న ఉద్దేశంతో.. డైమండ్ ప్రిన్‌సెస్ షిన్‌ను జ‌పాన్ క్వారెంటైన్ చేసింది.  ప్ర‌స్తుతానికి ఆ నౌక‌లో 621 మందికి కోవిడ్‌19 సోకిన‌ట్లు తేలింది.  నౌక‌లో మొత్తం 3700 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వ్యాధి సోకిన వారిలో జ‌పాన్‌, అమెరికా, చైనా, కెన‌డా, బెల్జియం, ఆస్ట్రేలియా, యూకే దేశస్థులు ఉన్నారు.  భారీ నౌక‌ను 14 రోజుల పాటు దూరంగా పెట్టినా.. వైర‌స్ వ్యాప్తిని మాత్రం పూర్తిగా నియంత్రించ‌లేక‌పోయారని జ‌పాన్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.